Header Banner

చంద్రబాబు ఢిల్లీ టూర్ కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! ఏపీ కోసం కీలక చర్చలు!

  Wed Mar 05, 2025 20:17        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల ఈ పర్యటన కోసం ఈ మధ్యాహ్నం 3 గంటలకు హస్తినకు చేరుకున్నారాయన. ఆ వెంటనే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు.

రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కొందరు ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

దాదాపుగా గంటకు పైగా అమిత్ షా- చంద్రబాబు మధ్య సమావేశం కొనసాగింది. పలు అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలు, రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు.. వంటి విషయాలపై చర్చలు సాగాయి. రాష్ట్రంలో శాసన, లోక్‌సభ సభ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై అంశం వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం- రాష్ట్రంలో ఇప్పుడున్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225కు పెరగాల్సి ఉంది. వీటిపై చంద్రబాబు.. అమిత్ షాతో చర్చించారని అంటున్నారు. అలాగే- దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ కింద జమిలి ఎన్నికలు జరగాల్సి వస్తే.. అత్యంత సీనియర్ నాయకుడిగా, ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్ష నేతగా ఇతర కూటమి పార్టీలను సమన్వయం చేయాల్సిన బాధ్యతలను బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుకు అప్పగించవచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

 

ఈ భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు.. నిర్మల సీతారామన్‌ను ఆమె నివాసంలో కలుసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల విడుదల గురించి కూడా కోరారని అంటున్నారు. చంద్రబాబు ప్రతిపాదనలపై నిర్మల సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #ChandrababuNaidu #DelhiTour #AmitShah #NirmalaSitharaman #AndhraPradesh #PolavaramProject #OneNationOneElection #NDA #Amaravati #APPolitics #GSTDues #TDP #BJP #IndianPolitics #APDevelopment